రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల కు సింధు విద్యార్థి ఎంపిక.
హర్షం వ్యక్తం చేసిన పాఠశాల యజమాన్యం.....
బాన్సువాడ : రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల కు సింధు విద్యాలయం విద్యార్థి ఎంపికైనట్లు శుక్రవారం పాఠశాల యజమాన్యం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ. రాష్ట్ర స్థాయి లో సంగారెడ్డి జిల్లా లో నిర్వహించబడే 70 వార్షిక ఎస్జిఎఫ్ గేమ్స్ కి అండర్ 14 వాలీబాల్ విభాగం లో కామారెడ్డి లో నిర్వహించబడిన ఎంపిక లో ఉమ్మడి జిల్లా ల నుండి ఎంపికై న బాన్సువాడ సింధు విద్యాలయం విద్యార్థి సోఫియాన్ 8. వ తరగతి కి సింధు విద్యాలయం తరఫున పాఠశాల యజమాన్యం ఉపాధ్యాయ బృందం హర్ష వ్యక్తం చేసి, మేమెంటో అందజేసి అభినందించారు. అలాగే ఈ విజయాని కి తోడ్పడినటువంటి పీఈటీల కు అభినందనలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


