ప్రకృతిలో రంగుల రెక్కల సందడి మళ్లీ కనిపించాలంటే.. మొక్కలను పెంచుదాం, సీతాకోకచిలుకలను కాపాడుదాం!

ప్రకృతిలో రంగుల రెక్కల సందడి మళ్లీ కనిపించాలంటే.. మొక్కలను పెంచుదాం, సీతాకోకచిలుకలను కాపాడుదాం!


నాగర్ కర్నూల్ : రాష్ట్రంలో సీతాకోకచిలుకల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. గడిచిన పదేళ్లలో 40 నుంచి 50 శాతం వరకు సీతాకోకచిలుకలు తగ్గినట్లు పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పురుగుమందుల విచ్చలవిడి వినియోగం, కాంక్రీట్ నిర్మాణాల పెరుగుదలతో రంగుల రెక్కలు కనుమరుగవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 150 నుంచి 160 రకాల సీతాకోకచిలుకలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.అమ్రాబాద్, కవ్వాల్, పాకాల, ఏటూరునాగారం అడవులు సీతాకోకచిలుకలకు ప్రధాన ఆవాసాలుగా ఉన్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్, పోచారం, అనంతగిరి ప్రాంతాల్లోనూ వివిధ జాతులు కనిపిస్తున్నాయి.పంటలపై పురుగుమందుల ప్రభావంతో గుడ్లు, గొంగళి పురుగులు మృత్యువాత పడుతున్నాయి. జిల్లేడు, ఉత్తరేణి, తుమ్మ వంటి మొక్కలు తొలగించడంతో ఆవాసాలు కోల్పోతున్నాయి. పట్టణాల్లో చెట్ల నరికివేత, విదేశీ మొక్కల పెంపకంతో ఆహారం, ఆశ్రయం కరువవుతోంది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలతో మరింత ముప్పు ఏర్పడుతోంది.

పరపరాగ సంపర్కంలో కీలక పాత్ర

సీతాకోకచిలుకలు కేవలం అందానికే కాదు.. పంటల పరపరాగ సంపర్కంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కూరగాయలు, పండ్లు, పప్పులు, నూనెగింజల పంటల దిగుబడికి సీతాకోకచిలుకలు దోహదం చేస్తున్నాయి. పక్షులు, కప్పలు, బల్లులకు గొంగళి పురుగులే ప్రధాన ఆహారం.పర్యావరణ కాలుష్యాన్ని ముందుగా గుర్తించే జీవులుగా సీతాకోకచిలుకలకు గుర్తింపు ఉంది. కాళ్లపై ఉండే ప్రత్యేక సెన్సార్లతో ఆహారం, గుడ్లు పెట్టే మొక్కలను గుర్తిస్తాయి.

బటర్‌ఫ్లై గార్డెన్లు ఏర్పాటు చేయాలిమళ్లీ సీతాకోకచిలుకల సందడి పెంచేందుకు ప్రత్యేక బటర్‌ఫ్లై గార్డెన్ల ఏర్పాటుకు నిపుణులు సూచిస్తున్నారు. మున్సిపల్ పార్కులు, పట్టణ వనాల్లో సీతాకోకచిలుకలకు అనుకూలమైన తోటలు పెంచాలని కోరుతున్నారు.గన్నేరు, నందివర్ధనం, నిమ్మ, కరివేపాకు, మందార, సంపెంగ వంటి స్థానిక మొక్కలు నాటాలని సూచిస్తున్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని పర్యావరణ నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్ల బాల్కనీల్లో తేనె అందించే పూల మొక్కలు పెంచితే తిరిగి సీతాకోకచిలుకలు వస్తాయని చెబుతున్నారు.సీతాకోకచిలుకల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్