లిస్టు వచ్చి 6 నెలలు అయినా నౌకరు ఎక్కని ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగులు?
కరీంనగర్ కాంగ్రెస్ నాయకుల పెత్తనం ఏందని నిరుద్యోగుల ప్రశ్న
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ డిపోలో ఔట్ సోర్సింగ్ కండక్టర్ నియామకం ఉద్యోగాలలో కరీంనగర్ నాయకుల పెత్తనం ఏందని హుస్నాబాద్ ప్రాంత ఔట్ సోర్సింగ్ కండక్టర్ అభ్యర్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.ఈ సందర్బంగా ఔట్ సోర్సింగ్ కండక్టర్ అభ్యర్థుల లిస్టు వచ్చి ఆరు నెలలు దాటిన ఉద్యోగానికి మాత్రం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ నాయకులు సిఫారసు లేఖలు ఇస్తే అభ్యర్థులను తీసుకోవడం ఏందని ప్రశ్నిస్తున్నారు. స్థానిక నేతలను కలిసిన న్యాయం జరగడం లేదన్నారు.కరీంనగర్ నాయకులు ఇచ్చే సిఫారసు లేఖలతో హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకు అన్యాయం చేయవద్దని ప్రాధేయపడ్డారు.మంత్రి పొన్నం అనుచరుల సిఫారసు లేఖలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పోస్టర్ వాట్సాప్ గ్రూపులో చక్క్కర్లు కొడుతుంది. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి లిస్టు వచ్చిన హుస్నాబాద్ ప్రాంత నిరుద్యోగులకి ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థులకు ఔట్ సోర్సింగ్ కండక్టర్ ఉద్యోగంలో చేర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడి నిరుద్యోగులకు అన్యాయం చేయవద్దని అభ్యర్థులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


