మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్

ఆదిలాబాద్ బ్యూరో  : అదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్‌లో ఎస్.టి. జోసెఫ్స్ కాన్వెంట్ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రహరి క్లబ్  – డ్రగ్ అబ్యూస్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ఈ సమయంలో మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని విద్య, క్రీడలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కు అలవాటు పడకుండా ఉండటమే కాకుండా, ఎవరైనా మాదకద్రవ్యాల ప్రభావానికి గురవుతున్నట్లు గుర్తిస్తే వారికి సరైన అవగాహన కల్పించి సహాయం అందించాలని కోరారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులతో పాటు ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎస్.టి. జోసెఫ్స్ కాన్వెంట్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి.. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కండి అని విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. మంచి సమాజ నిర్మాణం నేటి విద్యార్థుల నుంచే ప్రారంభమవుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత అదిలాబాద్ నిర్మాణానికి సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌తో పాటు మున్సిపల్ కౌన్సిలర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్