లింగోటం గ్రామంలో. ఉపసర్పంచ్ నంటూ మహిళపై దాడి ..

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. గ్రామస్తులు

లింగోటం గ్రామంలో.  ఉపసర్పంచ్ నంటూ మహిళపై దాడి ..

అచ్చంపేట (నాగర్ కర్నూల్ జిల్లా) : నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని  లింగోటం గ్రామంలో ఎర్రమోని లక్ష్మమ్మ పై ఉపసర్పంచ్ అంటూ నేతల. తిరుపతయ్య దుర్భాషలాడుతూ దాడి చేయడం స్థానికంగా దుమారం లేపింది. బాధితురాలు లక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం లింగోటం గ్రామ సర్పంచ్ తాడం జయప్రకాష్. మరియు ఉప సర్పంచ్ నేతల లక్ష్మమ్మ ఉండగా లక్ష్మమ్మ కొడుకు తిరుపతయ్య గ్రామంలో ఉప సర్పంచ్ నేనే అని చెప్పుకుంటూ పలు కార్యక్రమాలలో ఫ్లెక్సీల పై ఉపసర్పంచ్ అంటూ ఫోటోలు వేసుకోవడం అలాగే గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో  ఉపసర్పంచనని   పాల్గొంటారని స్థానికులు తెలిపారు  పేరుకు మాత్రం ఉపసర్పంచ్ లక్ష్మమ్మ అయితే అతని కొడుకు తిరుపతయ్య ఉపసర్పంచ్  నేనే అంటూ చెప్పుకుంటూ గ్రామంలో జరిగే కార్యక్రమాలలో చలామణి అవుతుంటాడని తెలిపారు . లక్ష్మమ్మ గ్రామ మహిళా అని కూడా చూడకుండా  ఒంటరిగా చూసి  దుర్భాషలాడుతూ మహిళ అనే కనికరం కూడా లేకుండా చేయి చేసుకోవడం జరిగిందన్నారు. తిరుపతయ్య పైన అచ్చంపేట పోలీస్ స్టేషన్లో బాధితురాలు లక్ష్మమ్మ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో  . బాధితురాలు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా తిరుపతయ్య పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు

Views: 332

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్