దాబాలు, హోటళ్లపై పోలీసుల మెరుపు దాడులు

అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారితే కఠిన చర్యలు తప్పవు

దాబాలు, హోటళ్లపై పోలీసుల మెరుపు దాడులు

జూదం, పేకాట, అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై సమాచారం ఇవ్వాలి: ఎస్పీ మహేష్ బి. గితే
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని దాబాలు, ప్రధాన రహదారుల వెంబడి ఉన్న హోటళ్లలో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాబాలు, హోటళ్లలో నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాలు, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సంబంధిత శాఖల అనుమతులు, లైసెన్సుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనుమతులు లేకుండా పర్మిట్ రూములు నిర్వహించడం, అక్రమంగా మద్యం నిల్వ చేయడం, విక్రయించడం, అనధికారికంగా మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు. దాబాలు, హోటళ్లను కేంద్రంగా చేసుకుని జూదం, పేకాట, సట్కా మట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు పొందడంతో పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న దాబాలు, హోటళ్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ప్రజల భద్రతకు భంగం కలగకుండా పోలీస్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని, ఆకస్మిక తనిఖీలను మరింత విస్తృతం చేస్తామని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.

Views: 97

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్