కొమురవెల్లిలో KVIC ఆధ్వర్యంలో పది రోజుల పాటరీ శిక్షణ ముగింపు

కొమురవెల్లిలో KVIC ఆధ్వర్యంలో పది రోజుల పాటరీ శిక్షణ ముగింపు

కొమురవెల్లి (సిద్దిపేట) :  గ్రామీణ కుమ్మరి కళాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు, సంప్రదాయ కుమ్మరి వృత్తిని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో KVIC ఆధ్వర్యంలో కొమురవెల్లి గ్రామంలో నిర్వహించిన పది రోజుల పాటరీ శిక్షణ కార్యక్రమం నేటితో విజయవంతంగా ముగిసింది.ఈ పది రోజుల శిక్షణలో కుమ్మరి వృత్తికి సంబంధించిన ఆధునిక పద్ధతులు, పాటరీ తయారీ విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వివిధ రకాల మట్టి ఉత్పత్తుల తయారీపై శిక్షణార్థులకు నిపుణులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ఆన్లైన్ మానీటరింగ్ and అబ్జెర్వర్ KVIC డైరెక్టర్ డాక్టర్ మనోజ్ లంక , సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎన్.  లతాదేవి  KVIC టెక్నికల్  ఎక్స్‌పర్ట్  సంజూరావు గారు , అఖిల భారత కుమ్మర  ప్రజపతి  కుంభకార్ మహాసంగ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్  శివానంద్  మాస్టర్ ట్రైనర్ వినయ్, కొమురవెల్లి గ్రామ ఉపసర్పంచ్ పోతు గంటి శ్రీనివాస్ కొమురవెల్లి గ్రామ కుమ్మరి సంఘం తరఫున  మండల అధ్యక్షుడు పోతుగంటీ కొమురవెల్లి. కొమురవెల్లి గ్రామ అధ్యక్షుడు శ్రీను,టీం మెంబెర్ పోతు గంటి బిక్ష పతి,పోతుగంటి రవి KVIC సెంటర్ ఇన్‌చార్జ్ తరీగొప్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కుమ్మరి అభ్యర్థులు పది రోజుల పాటు శిక్షణ పొంది, విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కుమ్మరి వృత్తిదారులకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు, సంప్రదాయ వృత్తికి ఆధునికతను జోడించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.గ్రామీణ చేతివృత్తిదారులకు ప్రోత్సాహం అందిస్తూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్న KVIC అధికారులకు కుమ్మరి సంఘం సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్