తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి

తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి

నిజామాబాద్ : తెలంగాణ యూనివర్సిటీ లో విద్యార్థుల మధ్య మాటల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థి తనకు తెలిసిన బయటి వ్యక్తులను రప్పించి దాడి చేయించిన ఘటన కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బయటి వ్యక్తులతో..
హాస్టల్ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మాస్యూటికల్ నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా, అప్లైడ్ ఎకనామిక్స్ రెండో సంవత్సరం విద్యార్థి ఏదో విషయంపై అదే సమయంలో మాట్లాడాడు. దీంతో సీనియర్ విద్యార్థులకే ఎదురు చెబుతావా..? అంటూ సదరు సీనియర్​ జూనియర్​పై వాగ్వాదానికి దిగి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ సీనియర్​ విద్యార్థి యూనివర్సిటీతో సంబంధం లేని తనకు పరిచయమున్న బయటి వ్యక్తులకు ఫోన్ చేయగా, ఐదుగురు వ్యక్తులు మాస్కులు ధరించి యూనివర్సిటీ హాస్టల్‌కు వచ్చి జూనియర్​పై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో జూనియర్​ తలకు తీవ్ర గాయమైంది. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్​కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేశారు. దాడిలో గాయపడిన జూనియర్​ అదే అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల సూచన మేరకు అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
గతంలోనూ బెదిరింపులు?
ఈ ఘటనకు పాల్పడ్డ సీనియర్​ గతంలోనూ జూనియర్ విద్యార్థులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో యూనివర్సిటీ వార్డెన్ జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ మరోసారి జూనియర్ విద్యార్థిపై బయటి వ్యక్తులను రప్పించి దాడి చేయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ హాస్టల్‌లోకి బయటి వ్యక్తులు మాస్కులు ధరించి ప్రవేశించి విద్యార్థిపై దాడికి పాల్పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కేసు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్