చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.

వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ధ్వంసంపై విశ్వకర్మల ఆగ్రహం

చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.

*బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 

*అఖిల భారత విశ్వకర్మ మహాసభ మెదక్ జిల్లా కమిటీ డిమాండ్ 

రేగోడ్ (మెదక్ ) : మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం చింతకుంట గేట్ వద్ద సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహాన్ని  గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం చారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ధ్వంసం పట్ల స్థానిక విశ్వకర్మ సంఘం నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ రేపు 14-11-2026న చలో నర్సాపూర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ జాతీయులు, హిందూ బంధువులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరారు. సుమారు 10 వేల మందితో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెదక్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ చారి,ప్రధాన కార్యదర్శి నాగభూషణం చారి తెలిపారు.విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి చలో నర్సాపూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక విశ్వకర్మ సంఘం నాయకులు,హిందూ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్