ఏఐటియుసి 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ :...
బాన్సువాడ : ఏ ఐ టి యు సి 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ పట్టణం లో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఏఐటీయూసీ జెండాను ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారతదేశ తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని కార్మికుల హక్కుల కోసం పోరాడే యూనియన్ ఏఐటియుసి అని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా అనేక కార్మిక చట్టాలు అమలులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న చట్టాలను హరించి వేస్తున్నారని ఆయన విమర్శించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు పండగ జాతీయ సెలవులు మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రేణుక, సురేఖ, సంగీత, కళ్యాణి, అనురాధ, వినోద ఏఐటీయూసీ నాయకులు చెన్నం గారి సురేష్, తోట శ్రీనివాస్ , ప్రభాకర్, లింగరాజు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


