విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
అంబర్‌పేటలో కాచిగూడ ట్రాఫిక్ పోలీసుల ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం
అంబర్‌పేట: విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల పట్ల బాధ్యతాయుతమైన వైఖరిని అలవర్చేందుకు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబర్‌పేటలోని ఓ పాఠశాలలో ‘అరైవ్ అలైవ్’ పేరుతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ బి. వీర కౌశిక్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రహదారిపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, దాని వల్ల కలిగే పరిణామాలను విద్యార్థులకు వివరించారు. సరైన వయస్సు వచ్చే వరకు వాహనాలు నడపకూడదని, తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, హెల్మెట్ ధరించడం వంటి భద్రతా చర్యల ప్రాధాన్యత
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


