నీటిని ప్రజలు పొదుపుగా వాడుకునేలా గ్రామ సర్పంచులు చూసుకోవాలి

ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

నీటిని ప్రజలు పొదుపుగా వాడుకునేలా గ్రామ సర్పంచులు చూసుకోవాలి

గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి హనుమంతు నాయక్ అధ్యక్షతన శనివారం మండల స్థాయి సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ,  గ్రామాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సర్పంచులు వే గవంతంగా పూర్తి చేయాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలో మంచినీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని రానున్న జూలై నెల వరకు మనకు నీటి ఎద్దడి ఉండదని కానీ పొదుపుగా వాడుకోవాలని మన మండలంలో వర్షపాతం తక్కువగా నమోదయిందని ఎగువన కురిసిన వర్షాలకు మండలంలోని మానేరు డ్యాం మరియు చెరువులు నిండుకుండలా ఉన్నాయని అన్నారు. వరి కోతలైనాక ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టి కొనుగోలు సెంటర్కు తీసుకురావాలని కోరారు. పర్మిషన్ లేకుండా ఎవరు బోర్లు వేసుకో రాదని ఎవరైనా వేసినచో తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.సమావేశంలో పలువురు సర్పంచులు తమ గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని అధికారుల దృష్టికి తీసు కువచ్చి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఎల్ నినో ప్రభావంతో రానున్న కాలంలో వర్షాభావం, నీటి కొరత ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఆదా చేయాలని, నీ టి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు నిరంతరాయంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సర్పంచులు విజ్ఞప్తి చేశా రు. ఈ సమావేశంలో ఎంపీడీవో రాజేందర్, తహసిల్దార్ మారుతి రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వేషాల వెంకటి,
ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో అరుణ, హౌసింగ్ ఏఈ భవ్యతో పాటు పీఆర్, ఆర్డ బ్ల్యూఎస్, గ్రిడ్, సెస్ శాఖల అధికారులు వేణు, భరత్, ప్రేమ్ సాగర్, ఆనంద్ కుమార్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నాగపురి బాలరాజు గౌడ్, మల్లు గారి పద్మ నరస గౌడ్, ఉమా రెడ్డి విమల శంకర్ రెడ్డి, కమ్మరి గంగ సాయవ్వ రాజారం, చంద్రశేఖర్ రెడ్డి, పంచా యతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 71

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!