టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం
నవంబర్ 15న జరగనున్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఏ. పరిపూర్ణం, ప్రధాన కార్యదర్శి పి. వెంకటస్వామి పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి హౌదేకర్ నవీన్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు నాగర్ కర్నూల్ జిల్లా నుంచి జర్నలిస్టులు భారీగా తరలిరావాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాలన్నారు. టీడబ్ల్యూజేఎఫ్ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనాలని తీర్మానించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సయ్యద్ షఫీ, వెంకటేష్, బంగారయ్య, కోశాధికారి బాదం పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


