హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి

హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి

గౌరవెల్లి,గండిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని,ఎంసిపిఐసి సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.మూడు మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలని శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో హుస్నాబాద్‌కు పాదయాత్రగా వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ నిర్ణయం అమలులోకి రాలేదని పేర్కొన్నారు. సంబంధిత మండలాలను కరీంనగర్ జిల్లాలో కలిపే ప్రక్రియను ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డిడిమాండ్ చేశారు.


గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాలి

 

హుస్నాబాద్ విజన్ ఆంధ్ర అక్టోబర్ 24÷


హుస్నాబాద్ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ప్రజలకు తాగునీరు అందించేందుకు గౌరవెల్లి,గండిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గండిపల్లి ప్రాజెక్టు పనులు సుమారు 40 శాతం మాత్రమే పూర్తయ్యాయని పేర్కొంటూ, మిగిలిన పనుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.
ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటనలు చేయడంతో పాటు, అవసరమైన నిధులను కేటాయించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. హుస్నాబాద్ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని తెలిపారు


ప్రజా సమస్యలపై పోరాటం


రాష్ట్రంలో ప్రజా పాలన, ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తున్నామని ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎం సి పి ఐ సి త్వరలో కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతుందని వెల్లడించారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!