రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!
బిఎస్పి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, పచ్చిమట్ల రవీందర్ గౌడ్
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని కరెంటు,నీరు పొదుపుగా వాడాలని అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటే కోతుల వల్ల తీవ్ర నష్టం జరిగే పరిస్థితులు ఉంటాయని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీంద్ర గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కోతుల పట్ల సమగ్ర ప్రణాళిక లేక రైతులు వరి పంట తప్ప వేరే పంటల వైపు మొగ్గు చూపలేకపోతున్నారని,ఇట్టి విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని హుస్నాబాద్ నియోజకవర్గంలో కోతులు పట్టడానికి 10 కోట్ల నిధులు కేటాయించాలని కూడా గతంలో బీఎస్పీ పార్టీ పక్షాన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.కానీ మూడు సంవత్సరాలైనా మూడు కోతులు పట్టిన పరిస్థితి కనబడట లేదు.ఎల్ నినో ప్రభావం రైతుల మీద ఉంటుంది కాబట్టి రైతులకు సంబంధించి పంట రుణాలు, గృహా రుణాలు, వారి పిల్లల విద్య రుణాలు, ఇంకా ఏమైనా రుణాలు ఉంటే ప్రభుత్వ మాఫీ చేయాలని బిఎస్పి పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.క్రాప్ హాలిడే చేయాలంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.ఈ సమావేశంలో రైతులు గంగుల రాజయ్య,
కాశవేణి ఓదయ్య, దొంతరమైన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


