విద్యుతాఘాతంతో ఒకరి దుర్మరణం

విద్యుతాఘాతంతో ఒకరి దుర్మరణం

ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుతాఘాతంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాదకర ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఊకల్లు గ్రామానికి చెందిన నర్రా దేవేందర్(50) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.శుక్రవారం రాత్రి ఇంటి రేకులకు విద్యుత్ ప్రవాహం (కరెంట్) సరఫరా అవుతున్న విషయాన్ని గమనించకపోవడంతో,ప్రమాదవశాత్తు వాటిని తాకి విద్యుత్ షాక్ కు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి,స్థానికుల సహాయంతో అతడిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే,అప్పటికే అతడు మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు.దింతో ఆయన మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతుడు దేవేందర్ కు భార్య జయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట మార్చురీకి తరలించారు.

WhatsApp Image 2026-10-24 at 10.34.29 AM

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!