డిండి నీటి దోపిడీ ఆపండి.. పాలమూరును కాపాడండి!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జేఏసీ అల్టిమేటం - నాగర్ కర్నూల్ జిల్లాలో సంతకాల సేకరణ

డిండి నీటి దోపిడీ ఆపండి.. పాలమూరును కాపాడండి!

డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్గొండ జిల్లాకు అక్రమంగా నీటిని తరలించడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిండి నీటి తరలింపును వ్యతిరేకిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బి. గోవర్ధన్, పి. వెంకటస్వామి, ఓ. శోభన్‌బాబు, కృష్ణయ్య, కే. చంద్రయ్య, గాజుల చెన్నయ్య, టీ. మద్దిలేటి, గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంఘాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై సంతకాలు చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పాలమూరు ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. పాలమూరు నీటి దోపిడీని అరికట్టకపోతే సమాజం ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. డిండి నీటి తరలింపు పథకాన్ని వెంటనే విరమించుకుని పాలమూరు ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!