మాణిక్యపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ చౌదరపల్లి విజయభాస్కర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో భాగంగా మాణిక్యపురం గ్రామంలో ఐకేపీ (IKP), మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గౌరవ స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ చౌదరపల్లి విజయభాస్కర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నర్ర మహేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు చౌదరిపల్లి రోశయ్య, చౌదరిపల్లి పద్మ, బడికే కనులక్ష్మి, బుగ్గ పృథ్విరాజ్, వడగం లక్ష్మణ్, చాపల కనకలక్ష్మి, మైల స్వాతి, మహిళా సంఘం అధ్యక్షురాలు చాపల లావణ్య, కుక్కల సుజాత, వీవోఏ వడగం శ్రీలత, సీసీ కవిత, వడగం హరీష్, రాగం రాంనర్సయ్య, బడికే మల్లేష్, చాపల కుమార్, చాపల వినయ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

