హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డిని సన్మానించిన ముదిరాజ్ సంఘం ప్రతినిధులు
హత్నూర మండల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు హత్నూర ఎస్సై శ్రీధర్ రెడ్డి గారిని హత్నూర పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వ కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా హత్నూర మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి రాజేందర్ మాట్లాడుతూ ఈనెల 22న జరిగిన పండుగ సాయన్న జయంతి వేడుకలు విజయవంతం కావడానికి పోలీస్ శాఖ ద్వారా అందించిన సహకారానికి గుర్తుగా ఈ సన్మానం చేశామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హత్నూర మండల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి రాజేందర్ కాసాల సర్పంచ్ కొటాల వెంకటేశం లింగాపూర్ సర్పంచ్ మణిదీప్ పల్పనూరు సర్పంచ్ ఆంజనేయులు ముదిరాజ్ సంఘం నాయకులు దుర్గయ్య రవి తలారి యాదగిరి పన్యాల రాజు హత్నూర యాదగిరి తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

