అవోపా కార్యాలయానికి సౌండ్ బాక్స్ వితరణ
కార్యాలయ అవసరాలకు సహకారం అందించిన అధ్యక్షులు
కల్వకుర్తి (నాగర్ కర్నూల్) : కల్వకుర్తి అవోపా కార్యాలయానికి అవోపా అధ్యక్షులు కలిమిచర్ల రాఘవేందర్, మారం రాకేష్ సంయుక్తంగా సౌండ్ బాక్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా అవోపా సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా ఆర్థిక కార్యదర్శి కల్వ ఆంజనేయులు, సీనియర్ సభ్యులు వీరబొమ్ము గౌరయ్య, పాలుట్ల జంగయ్య, పాపిశెట్టి లింగయ్య, కూన విజయకుమార్, మరాల వెంకటస్వామి, జూలూరి రవికుమార్, బిల్లకంటి వెంకటేశ్వర్లు, సామల రాజేష్, చిగుళ్లపల్లి శ్రీధర్, కొండూరి కృష్ణయ్య వీరమల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


