తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
మోహన్‌రావు గురుస్వామికి తహసీల్దార్ రవికుమార్ శుభాకాంక్షలు
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఇరుముడితో పాదయాత్ర ప్రారంభం
మండల కేంద్రమైన తాడిచెర్లకు చెందిన మల్కా మోహన్‌రావు గురుస్వామి 31వసారి అయ్యప్ప మాలధారణ చేసి, కేరళలోని శబరిమల క్షేత్రానికి మహా పాదయాత్రగా శనివారం బయలుదేరారు. ఈ సందర్భంగా తాడిచెర్లలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇరుముడి కట్టుకొని యాత్ర ప్రారంభించారు.
మోహన్‌రావు పాదయాత్ర విజయవంతం కావాలని మండల తహసీల్దార్ కె. రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.మాజీ అయ్యప్ప మాలధారులు, గురుస్వాములు సంపత్‌రావు, మల్కా భాస్కరరావు, తిర్రి అశోక్, మెతుకు సమ్మయ్య, కిషన్‌రావు, ఓదెల రాజబాబు, పడితల లింగారావు, కోట నవీన్, ముడితనపల్లి ప్రభాకర్ తదితరులు మోహన్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర నిర్విఘ్నంగా సాగి, స్వామివారి దర్శనంతో విజయవంతం కావాలని కోరుకున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

