రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!

బిజినపల్లి మండలంలో సర్పంచ్ వ్యవస్థకు అపహాస్యం - మహిళా పీఠాలపై పతుల పెత్తనం

రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలో మహిళా రిజర్వేషన్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. ప్రజల తీర్పుతో ఎన్నికైన మహిళా సర్పంచ్‌లు కాదు... వారి భర్తలే పీఠాలపై పెత్తనం చెలాయిస్తున్నారు. అధికారుల మౌనమే భర్తల ఆధిపత్యానికి వరంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మండలంలో తాజాగా జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ వింత పరిస్థితి బయటపడింది. మూడు నెలలకోసారి గ్రామాల అభివృద్ధి, సమస్యలు, నిధుల వినియోగంపై చర్చించాల్సిన ఈ కీలక సమావేశానికి మహిళా రిజర్వేషన్ లో ఎన్నికైన సర్పంచ్‌లు గైర్హాజరు కాగా, వారికి బదులు భర్తలు హాజరై కుర్చీల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

పీఠం ఆమెది.. పెత్తనం ఆయనది!

భార్య పేరుతో పదవి అనుభవిస్తూ భర్తలు అధికారం చెలాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తే, దాని స్ఫూర్తిని దెబ్బతీసేలా భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులే సమావేశాలకు హాజరుకావాలి, సంతకాలు చేయాలి. కానీ బిజినపల్లిలో మాత్రం నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.

మీటింగ్ లో అధికారుల మౌనం ఎందుకు?

జనరల్ బాడీ సమావేశం అధ్యక్షత వహించే ఎంపీడీవోనే అసలు సర్పంచ్‌లు కాకుండా భర్తలు వచ్చినా ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. సమావేశంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గట్టిగా హెచ్చరించి, మహిళా సర్పంచ్‌లనే తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తే తప్ప ఈ భర్తల పెత్తనానికి అడ్డుకట్ట పడదని స్థానికులు అంటున్నారు.

ఎంపీడీవో వివరణ..

ఈ విషయంపై ఎంపీడీవో కథలప్పను మా ప్రతినిధి ఫోన్ లో సంప్రదించగా, మీటింగ్ లో ఉన్నానని అన్నారు.

ఇకనైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, అసలు మహిళా సర్పంచ్‌లతోనే సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ల లక్ష్యాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Views: 209

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!