తుడుకూర్తిలో కుచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవం - ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణ
నాగర్ కర్నూల్ జిల్లా తుడుకూర్తిలో ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గారు తన తండ్రి పేరిట కొనసాగుతున్న ఈ సేవా సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. తన తండ్రి కుచుకుళ్ల రామచంద్రారెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు నాణ్యమైన కంటి వైద్యం అందడం గర్వకారణమని ఆయన అన్నారు. గత 28 ఏళ్లుగా వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేసి వెలుగు నింపుతున్న ఎల్.వి. ప్రసాద్ సంస్థ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ గారు స్వయంగా కంటి పరీక్ష చేయించుకుని, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ గారు, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ తీగల సునేంద్ర గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


