నీరందించాలంటూ బిందెలతో నిరసన...
.jpeg)
కుల్కచర్ల, వికారాబాద్ : కుల్కచర్ల మండలంలోని గ్రామాల్లో ఇప్పుడిప్పుడే నీటి సమస్య ప్రారంభమైంది. నీరందించాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ఘనాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గత వారం రోజులుగా గ్రామంలో నీటి సరఫరా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఘనాపూర్ గ్రామానికి చెందిన మహిళలు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాము వంట ఎలా చేసుకోవాలని మండిపడుతున్నారు. తాగునీరు లేక రోజు వారి పనులు ఎలా చేసుకోవాలో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో నీటి సమస్య ఉన్నది అధికారులు గుర్తించడంలేదంటున్నారు. కనీసం నీటి ట్యాంకర్లతోనైనా నీటిని అందించేలా చూడాలని మహిళలు కోరుతున్నాను.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


