వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వన్యప్రాణుల వేట, కలప స్మగ్లింగ్, అక్రమ విద్యుత్ వైర్ల ఏర్పాటు, గంజాయి సాగుపై కఠిన చర్యలు తీసుకోవాలి.

వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరం – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వన్యప్రాణుల కేసుల్లో నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడేలా పకడ్బందీ దర్యాప్తు చేపట్టాలి.

పోలీసు, అటవీ శాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహణ.

ఆదిలాబాద్వ న్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, పోలీసు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అక్రమ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్యప్రాణుల వేటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, వన్యప్రాణులను సంహరించిన కేసుల్లో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించడం, నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడేలా అనుసరించాల్సిన విధానాలపై పోలీసు, అటవీ శాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శిక్షణ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అడవుల్లో పులులు, ఇతర వన్యప్రాణులను వేటాడటం, అక్రమంగా కలప తరలించడం, పొలాల్లో అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసి వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలిగించడం, మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేయడం వంటి అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని ఎస్పీ సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అటవీ శాఖ అధికారులకు తెలిసిన వెంటనే జిల్లా పోలీసు అధికారులకు తెలియజేసి, సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.
వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం అత్యంత కీలకమని, అందుకు అనుగుణంగా దర్యాప్తు అధికారులు సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు. కేసుల దర్యాప్తు నుంచి న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు కూడా పోలీసు శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండు శాఖల అధికారులు పరస్పర సమాచార మార్పిడి, సమన్వయంతో పనిచేస్తూ అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. యూనిఫామ్ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ ఐఎఫ్‌ఎస్, శిక్షణలో ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఎఫ్‌ఆర్‌ఓలు, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓలు, రేంజ్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు, రైటర్లు, ఇతర పోలీసు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వీసీ ద్వారా కూడా పలువురు అధికారులు, సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త! నల్గొండ జిల్లాలో దారుణం భార్యను హతమార్చిన భర్త!
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మర్రిగూడ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది  నల్గొండ/మర్రిగూడ:అయ్యో దేవుడా.. ఏడాది కిందట పెద్ద కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ...
తాడిచెర్ల నుంచి శబరిమలకు భక్తి యాత్ర
హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలి
రిజర్వేషన్ ఆమెకు.. రాజ్యం ఆయనకు!
టీఎన్జీవో సభ్యత్వ నమోదు కార్యక్రమం
పేకాట స్థావరానికి స్థలం కల్పించిన మిట్టల్ జిన్నింగ్ మిల్లు యజమానిపై కేసు నమోదు
రైతుల పంట రుణాలు, వివిధ అప్పులు మాఫీ చేయాలి!!