సర్వేకు వచ్చిన వారికి నా కూలిన ఇల్లు కనిపించలేదా?
ఎమ్మెల్యే గారూ...మీరైనా స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వగలరని వేడుకోలు
గ్రామం:-వట్టెం
మండలం:-బిజినాపల్లి
జిల్లా:- నాగర్ కర్నూల్
గత వర్ష కాలంలోని వర్షాలకు బిజినపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన ఉల్లిగడ్డల వెంకటయ్య ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇంటి గోడలు, పైకప్పు కూలి శిథిలాల కుప్పగా మారింది. ఫోటోలో కనిపిస్తున్నట్టుగా ఆయన తన కూలిన ఇంటి శిథిలాల మీదే నిలబడి తన గోడును వెళ్లబోసుకుంటున్నాడు.
సర్వేకు వచ్చిన వారికి నా కూలిన ఇల్లు కనిపించలేదా?
ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామంలో జరిగిన సర్వేలో తన పేరు రాలేదని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
"నా ఇల్లు కూలిపోయి కళ్ల ముందే కనిపిస్తున్నా, సర్వేకు వచ్చిన వారికి నా కూలిన ఇల్లు కనిపించలేదా? నిరుపేదలమైన మాపై ఎందుకు ఈ వివక్ష? కావాలనే ఇవ్వడం లేదా?" అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎమ్మెల్యే గారికి వేడుకోలు... "గౌరవనీయులైన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కుచుకుళ్ల రాజేష్ రెడ్డి గారూ... మీ దయగల మనసుతో మీరైనా స్పందించండి. ఒక్కసారి వచ్చి నా కూలిన ఇంటిని చూడండి. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చూడండి. నాకు మీరే దిక్కు" అని వెంకటయ్య వేడుకుంటున్నాడు. అర్హుడైన నిరుపేదుడికి న్యాయం జరగాలని, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వట్టెం గ్రామస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


