విద్యార్థులకు అప్యాయ బోధన చేసిన మాజీ మంత్రి
వనపర్తి :ఉపాధ్యాయుడైసింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ఆసక్తిగా ఆలకించి సమాధానాలతో అబ్బురపరిచిన విద్యార్థులు. పారదర్శక ఓటర్ జాబితా బలోపిత ప్రజాస్వామ్యం పేరిట ప్రజలతో మమేకమవుతు న్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా"సర్"(ఓటర్ జాబితా సవరణ)లో ప్రజలు విధిగా పాల్గొనాలని అవగాహన కల్పిస్తూ విస్తృత పర్యటన చేస్తున్నారు. వనపర్తి మండలంలో అంజనగిరి గ్రామంలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి ఓటర్ జాబితా సవరణను పరిశీలిస్తూ అంజనగిరి ప్రాథమిక పాఠశాలలో కాసేపు తరగతి గదిలో ఉపాధ్యాయుడై విద్యార్థులకు ప్రత్యేక బోధన చేశారు. విద్యార్థులంతా ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలని శాకాహార తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో మేధాసంపత్తి పెరుగుతుందని అన్నారు శాకాహారంలో మాంసకృత్తులకు మించి ప్రోటీన్స్ ఉంటాయని అన్నారు.కూరగాయలు,ఆకుకూరలు పట్ల ఉపాద్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారుకూరగాయల వినియోగం వల్ల లాభాలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివరిస్తూ నేను క్యారెట్ తినకపోవడం వల్ల కళ్ల అద్దాలు వచ్చాయని చమత్కరించారు. బోర్డు మీద నియోజకవర్గం, గ్రామాల, రాష్ట్ర పేర్లు వ్రాసి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ప్రజలతో,విద్యార్థులతో నిరంజన్ రెడ్డి కలిసిపోవడం చూసిన గ్రామస్థులు నాయకులు,కార్యకర్తలు పదవి ఉన్నా లేకున్న ప్రజల పట్ల తన ఆతృతను చూపుతున్న నిరంజన్ రెడ్డి సేవాభావాన్ని కొనియాడారు. ఉపాద్యాయులు తమ పాఠశాలకు మాజీ మంత్రివ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వచ్చి మా యోగక్షేమాలు అడిగి తెలుసు కొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంజన్ రెడ్డి వెంట మాణిక్యం,రఘువర్ధన్ రెడ్డి,రవిప్రకాష్ రెడ్డి,మాధవ్ రెడ్డి,నాగవరం.నరేష్,డేగ.మహేశ్వర్ రెడ్డి,చిట్యాల.రాము ఉన్నారు.
Views: 80
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
