గుంతలమయంగా ముత్యంపేట ప్రధాన రహదారి
మల్యాల, : మల్యాల మండలం ముత్యంపేట గ్రామ ప్రధాన రహదారి గుంతలమయంగా మారి, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి న దుస్థితి ఏర్పడింది.
భారీ గ్రానైట్ లారీలతోనే రోడ్డు ధ్వంసం:
ఈ ప్రాంతం గుండా నిత్యం మితిమీరిన లోడ్‌తో ప్రయాణించే భారీ గ్రానైట్ లారీల కారణంగానే రహదారి పూర్తిగా అతుకుల బొంతగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీల ధాటికి రోడ్డుపై ఉన్న సిమెంట్, తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ప్రధాన వరద కాలువ బ్రిడ్జి వద్ద భారీ గుంతలు పడటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక అనేకమంది కిందపడి గాయాలపాలవుతున్నారు.
కరీంనగర్, కొండగట్టు వెళ్లే ప్రధాన మార్గం ఇదే..
ఈ రహదారి ఎంతో కీలకమైనది. మల్యాల మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకోవాలన్నా ఈ రహదారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ రోడ్డు ఇంత అధ్వాన్నంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు:
రహదారి సమస్యపై స్థానిక ప్రజలు, వాహనదారులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా అటు అధికారులు గానీ, ఇటు ప్రజాప్రతినిధులు గానీ స్పందించడం లేదని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి, వెంటనే బ్రిడ్జి వద్ద ఉన్న గుంతలను పూడ్చి, ముత్యంపేట ప్రధాన రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, భారీ గ్రానైట్ లారీల రాకపోకలను నియంత్రించాలని మండల ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
Views: 66
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
