కొండగట్టు సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
మల్యాల అంగడి బజార్ వద్ద కేక్ కటింగ్, మిఠాయిల పంపిణీ
ప్రజా నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మల్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ప్రజా సంక్షేమ పాలనను నిరంతరం కొనసాగించాలని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం మల్యాల అంగడి బజార్ వద్ద అభిమానులు, నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి సీఎం జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


