ఆదిలాబాద్ జిల్లా లో భారీగా దేశీదారు పట్టివేత - మహారాష్ట్ర నుండి అక్రమ రవాణా*
పెండల్వాడ శివారులో ఎక్సైజ్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంయుక్త దాడులు - 66.24 లీటర్ల దేశీ మద్యం స్వాధీనం - 5 మందిపై కేసులు
ఆదిలాబాద్ బ్యూరో : మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశీదారు మద్యం రవాణా చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. పెండల్వాడ గ్రామ శివారు ప్రాంతంలో శనివారం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా దేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ ఆదిలాబాద్ మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆదిలాబాద్ వారు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పిప్పల్ కోటి గ్రామం నుండి పెండల్వాడ గ్రామానికి నడక మార్గాన నెత్తిమీద దేశీదారు పెట్టెలు పెట్టుకొని తీసుకొస్తున్న బావునే శ్రీనివాస్, లాంగ్డే మారుతి, లాంగ్డే సునీల్, తప్రే రాజు, బావునే సుభాష్ లు అధికారులను చూసి వారి నెత్తిమీద ఉన్న దేశీదారు మద్యం పెట్టెలు వదిలి పారిపోయారు.
అధికారులు వాటిని లెక్కించగా మొత్తం 66.24 లీటర్ల దేశీ మద్యం లభించింది. అందులో 90 మీ.లీ పరిమాణం గల 36 లీటర్ల (400) దేశీదారు మద్యం బాటిళ్ళు, 180 మీ.లీ పరిమాణం గల 30.24 లీటర్ల (168) దేశీదారు మద్యం బాటిళ్ళు ఉన్నాయి. ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ దాడులలో ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆదిలాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ మరియు సిబ్బంది మధు, వెంకటేష్, హరీష్, బీరయ్య పాల్గొన్నారు.
ఎవరైనా దేశీదారు మద్యం రవాణా మరియు విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల శ్రీనివాస్ హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


