రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
24వ విడత 18 లక్షల 680 కోట్ల రూపాయలు 9.34 కోట్ల మంది రైతుల ఖాతాలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో కి విడుదల చేసిన ప్రధాని......
బాన్సువాడ : ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ దివాస్ సందర్భం గా ప్రధాన మంత్రి కిసాన్ 24 వ విడత 18,680 కోట్ల రూపాయలు 9.34 కోట్ల మంది రైతుల ఖాతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇప్పటికి వరకు 4.4 7 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి కి రాజేష్ తో కలిసి బీర్కూరు మండలం, భైరపూర్, రైతు వేదిక లో బిజెపి నాయకులు ప్రధాన మంత్రి కిసాన్ కార్యక్రమం వివేక్షించడం జరిగింది. ఈ సందర్భం గా బిజెపి మండల అధ్యక్షుడు సాయికిరణ్ మాట్లాడుతూ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు మన రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రైతుల పట్ల వివక్ష చూపడం మాను కోవాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏల్నీనో ప్రభావం తో పొలాల్లో నీరు లేక, పంట నష్టం జరిగి రైతులు తీవ్ర ఇబ్బంది గురి అవుతుంటే రాష్ట్రం లో రైతులను పట్టించు కోకుండా ఢిల్లీలో ఫేక్ ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
"పసల్ బీమా యోజన" రాష్ట్రం లో అమలు చేయకపోవడం దుర దృష్టకరమని ఆయన అన్నారు రాష్ట్రం లో రైతుల ఓట్లతో ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి అదే రైతుల ని నట్టేట ముంచుతున్నారని వెంటనే రైతుల ను ఆదుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేపట్టి రైతుల కు న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంద ని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్, ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేష్, ఇస్తాను జిల్లా కార్యదర్శి కొమ్మినేని రాజేష్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి సాయి బాబా, బిజెపి సీనియర్ నాయకులు లక్కవల్లి పంచు గుండ, మండల ఉపాధ్యక్షుడు హనుమాన్లు, బిజెపి నాయకులు పండరి, ప్రవీణ్, నాగేష్, బసోళ్ళ సాయిలు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


