రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలి
అదనపు కలెక్టర్ రాజాగౌడ్
నిజామాబాద్ : రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో వివిధ కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ దిశగా సంబంధిత శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను గుర్తించి ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


