10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య
.jpg)
చందుర్తి (రాజన్న సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా,చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామానికి చెందిన ఖుషి వైష్ణవి (17) అనే విద్యార్థిని ఈరోజు శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.వైష్ణవి రుద్రంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ,తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే ఆమె బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వైష్ణవి మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


