సేవకు గుర్తింపు.. డాక్టరేట్ ప్రధానం.. 

WhatsApp Image 2026-10-10 at 6.35.35 AM
- చెన్నై లో డాక్టరేట్ అందుకున్న అబ్బగొని అశోక్ గౌడ్  

చెన్నై : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజక వర్గానికి చెందిన  అబ్బగోని అశోక్ గౌడ్ కు యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారు శుక్రవారం చెన్నై లోని  కృష్ణ గానసభలో డాక్టరేట్ ను ప్రధానం చేసింది.  గత 20 ఏళ్లుగా సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న ఆయనకు ఇది లభించింది.  నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటున్న అతనికి డాక్టరేట్ లభించటం పట్ల ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  అశోక్  నిరుపేదలకు అండగా నిలవడం, నిరుద్యోగ యువతకు మార్గదర్శనం అందించడం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా  అశోక్  పాల్గొనేవారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న పేదలకు వైద్య సహాయం, అత్యవసర సమయాల్లో రక్తదాతలను సమన్వయం చేయడం, నిరుపేదలకు సహాయం  వంటి సేవా కార్యక్రమాల ద్వారా… సమాజానికి తన వంతు సహకారం అందిస్తున్నారు. మానవత్వం, సేవాభావం, ప్రజల పట్ల బాధ్యత అనే లక్ష్యాలతో అబ్బగొని శోక్ గౌడ్‌కు ఈ డాక్టరేట్ లభించడం పట్ల… ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుర్తింపు భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరణగా నిలుస్తుందని అబ్బగొని అశోక్ గౌడ్  అభిప్రాయపడుతున్నారు.  

WhatsApp Image 2026-10-10 at 6.35.34 AM

 

 

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.