ఘనంగా నోముల భగత్ జన్మదిన వేడుకలు

రక్త దానం చేసిన మండల నాయకులు, కార్యకర్తలు
త్రిపురారం (నల్గొండ) : నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకను శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బైరం కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ ను కట్ చేసి ప్రజలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం హాలియా మండల కేంద్రానికి వెళ్లి నోముల భగత్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో త్రిపురారం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్త దానం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బైరం కృష్ణ, అనుముల సుధాకర్ రెడ్డి, అనుముల శ్యామ్ సుందర్ రెడ్డి, అనుముల శ్రీనివాస్ రెడ్డి, మజ్జిగపు వెంకట్ రెడ్డి, జంగిలి శ్రీనివాస్ యాదవ్, నగిరి వెంకన్న, నగిరి శ్రీనివాస్, గోపు కోటిరెడ్డి, జంగిలి రామలింగం, బురాన్, తాటికొండ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
.jpeg)
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


