దసరా ఉత్సవాలకు డైట్ మైదానంలో భూమి పూజ చేసిన కంది మౌన శ్రీనివాస రెడ్డి 

WhatsApp Image 2026-10-11 at 4.06.00 AM

ఆదిలాబాద్ బ్యూరో : ప్రజలందరిపై దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి  సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి  ఆకాంక్షించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ డైట్ మైదానంలో బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై వేడుకలకు సమితి సభ్యులతో కలిసి భూమి పూజ చేసారు. ఈ  సందర్భంగా ప్రజలకు దసరా, మహిళలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి హిందూ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతూ పట్టణంలో అనేక హిందూ పండగల ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. క్రమం తప్పకుండా గత పధ్నాలుగేళ్లుగా ఇక్కడ దసరా శరన్నవరాత్రోత్సవాలు చేపడుతూ ఆ ఆనవాయితీని కొనసాగిస్తోన్న సమితి సేవలను ఆమె అభినందించారు. ఇలాగే మున్ముందు మరిన్ని ఉత్సవాలు చేపట్టాలని అన్నారు.  ప్రజలందరూ దసరా బతుకమ్మ పండగలను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని కంది మౌనా శ్రీనివాస రెడ్డి  ఆకాంక్షించారు.

 

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..... ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.....
పట్టువస్త్రాలు సమర్పించిన అడిషనల్ కలెక్టర్ నగేష్  పాపన్నపేట (మెదక్) : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ఆదివారం రోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ...
నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
మున్సిపల్, విద్యుత్ ఏఈ లను సస్పెండ్ చేయాలి..!
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం
ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్
బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దుర్గాదేవి..  
ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సహాయం..