శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాలువకు నీటి విడుదల ప్రారంభం..

2000 క్యూసెక్కుల నీరు..
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాలువ (ఎల్‌ఎండీ ఎగువ ప్రాంతం) ఆయకట్టు కోసం అధికారులు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల చేపట్టినట్లు ఇరిగేషన్ సర్కిల్ పోచంపాడ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ వి. జగదీష్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు 2,000 క్యూసెక్కుల సాగునీటిని అధికారులు విడుదల చేశారు. అనంతరం నీటి విడుదలను క్రమంగా పెంచనున్నట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తగినంత నీటి నిల్వలు లేనందున, విడుదల చేసిన సాగునీటిని రైతులు సక్రమంగా, పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


