పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

WhatsApp Image 2026-10-10 at 5.56.10 AM

నాంపల్లి : నాంపల్లి ని కరువు మండలంగా ప్రకటించి, ప్రత్యేక ప్యాకేజీ కల్పించాలని సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి డిమాండ్ చేశారు. రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పసునూరులో  పంటలను పరిశీలించారు. పొలాలలో పూర్తిగా నీరు లేకపోవడంతో పగుళ్లు బట్టి నాలుగు ఎకరాలు వరి పంట ఎండిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు వర్షాభావం లేక సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో ఎంతోమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆయన అధికారులను కోరారు. ఎల్ నీనో పరిస్థితిలు వాతావరణం మార్పుల నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలన్నీటికి 100% మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి కోరారు.

ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు విద్యుత్ కొరత రోజుకు 7నుండి 9 గంటల మాత్రమే కరెంటు ఇస్తున్న కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి నీటిని ఆదా చేసి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపి ఉంటే ప్రస్తుతం రైతులకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదన్నారు.వ్యవసాయానికి అవసరమైన మేరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతుల మోటర్లు కాలిపోతున్నాయని మరియు మోటార్లు పనిచేయక పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రైతులతో కలిసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, ఆకారపు కాశయ్య, అందుగుల రాములు, ఆంజనేయులు, సైదులు రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..! గర్భిణిని తరలిస్తు మార్గమధ్యలో పంచరైన 108 అంబులెన్స్‌..!
జోగిపేట నుంచి మరో అంబులెన్స్‌ రప్పించిన పైలెట్ చౌటకూర్  (సంగారెడ్డి) : అత్యవసర సమయంలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌ మార్గమధ్యంలో మొరాయించింది.శనివారం మధ్యాహ్నం పుల్కల్‌...
టిపిటిఎఫ్ దంతాలపల్లి మండల శాఖ నూతన కమిటి ఎన్నిక
గొంగ్లూర్ లో బతుకమ్మ ఘాట్ ను ప్రారంభించిన సర్పంచ్
10వ తరగతి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య  
- వేటగాళ్ల ఉచ్చుకు రైతు మృతి, మాయమైన మృతదేహం..!
నాగ సముద్రాల పియంశ్రీ పథకం ద్వారా వచ్చిన పాఠశాల రెండు కోట్ల నిధులపై విచారణ జరిపి నిగ్గుతెల్చాలి 
దసరా సెలవుల్లో ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్.