గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుని కుటుంబానికి రూ. లక్ష ప్రమాద బీమా పరిహారం

గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుని కుటుంబానికి రూ. లక్ష ప్రమాద బీమా పరిహారం

 హన్మకొండ న్యూస్ :  హనుమకొండలోని గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు మేరుగు రవికుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి బ్యాంక్ తరఫున ఉన్న ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) పరిహారాన్ని శుక్రవారం అందజేశారు.బాధితుని నామినీ, భార్య మేరుగు మనీష గారికి డీఆర్డీఏ  మేన శ్రీను  చేతుల మీదుగా చెక్కును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మేన శ్రీను  మాట్లాడుతూ, ఖాతాదారులకు బ్యాంక్ అందిస్తున్న ఇలాంటి బీమా పథకాలు ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తాయని అన్నారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయత్రి బ్యాంక్ అందిస్తున్న సేవలను, సామాజిక బాధ్యతను అభినందించారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మ్యాదరి సందీప్ కుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి