ఇంటికి తాళం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి

- దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి - ప్రశాంత వాతావరణంలో దసరా వేడుకలు జరుపుకోండి - గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ డి. రవి రాజు

ఇంటికి తాళం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :దసరా పండుగ మరియు సెలవుల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ రూరల్ సిఐ డి. రవి రాజు సూచించారు. ప్రయాణాలు, పండుగ వేడుకల సమయంలో జరిగే నేరాలు, ప్రమాదాలను నివారించడానికి ప్రజలు క్రింది ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఊరికి వెళ్లేటప్పుడు ఇంటి తలుపులకు తాళాలు సరిగ్గా వేసి, విలువైన బంగారం, నగదును సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని, ఎక్కువ రోజులు దూరంగా ఉంటే స్థానిక పోలీసులకు లేదా పొరుగువారికి సమాచారం ఇవ్వాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కారు ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ మాట్లాడడం వంటివి చేయకూడదన్నారు. ఆలయాలు, మార్కెట్లో మొబైల్స్, పర్సులు జాగ్రత్తగా చూసుకోవాలని, వాహనాలను కేవలం కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి లాక్ చేయాలన్నారు. రద్దీ ప్రదేశాల్లో పిల్లలను ఒంటరిగా వదలకుండా జాగ్రత్త వహించాలన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి, పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి