బొమ్మనపల్లి లో విషాదం

విద్యుత్తు లైన్ తెగిపడి గ్రామపంచాయతీ వర్కర్ మృతి  మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ 

బొమ్మనపల్లి లో విషాదం

 అచ్చంపేట ;.(నాగర్ కర్నూల్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్తు లైన్ తెగిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది స్థానిక గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్న సౌటా బాలయ్య(45) గత ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రామపంచాయతీ లో వర్కర్ గా పనిచేస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా గ్రామంలో చెట్లను తొలగిస్తుండగా ఎల్టిలైన్ తెగిపడి బాలయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు గతంలో విద్యుత్ వైర్లు చెట్లకు తగిలి ప్రమాదంగా ఉన్నదని సంబంధిత విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు విద్యుత్ షాక్కు తగిలిన వెంబడే బాలయ్యను హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని బాలయ్య మృతికి గల కారణాలను  పంచనామ నిర్వహించారు మృతునికి భార్యాపిల్లలు ఉన్నారు గ్రామ మాజీ సర్పంచ్ బోట్క నాయక్ మాజీ ఎంపిటిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి బాలయ్య కుటుంబానికి 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి