బిజినపల్లి వృద్ధాశ్రమంలో బీజేపీ నేతల సేవా కార్యక్రమం
ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలన పురస్కరించుకుని పండ్ల పంపిణీ
బిజినపల్లి (నాగర్ కర్నూల్):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా సేవా జీవితాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ - 2026లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రశాంతి నిలయం వృద్ధాశ్రమంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులకు పండ్లు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ చిత్రపటంతో కూడిన సేవా సంకల్ప అభియాన్ బ్యానర్ ను ఏర్పాటు చేసి వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 25 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రజా సేవలో కొనసాగుతున్నారని, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే పేదలు, వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పంజగుల నాగేందర్ గౌడ్ గారు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు జెట్టి వెంకటేష్ గారు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస గౌడ్, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి మల్లికేడి లక్ష్మీనారాయణ గారు, ఓబీసీ జిల్లా కార్యదర్శి ఊరుకొండ రఘుబాబు గారు, చంద్రకళ అక్కగారు, బీజేపీ సీనియర్ నాయకులు వెంకటయ్య గారు, నారాయణచారి గారు, మండల మాజీ జనరల్ సెక్రటరీ బాలస్వామి గారు, బీజేవైఎం మండల అధ్యక్షులు సంతోష్ గారు, ఓబీసీ మండల అధ్యక్షులు ఇండ్ల మహేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


