రూ.22 లక్షల రైతు వేదిక శిథిలావస్థలోకి..?
నిద్రమత్తులో వ్యవసాయ శాఖ అధికారులు
మర్పల్లి : రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు, సాగు సూచనలు అందించాలనే లక్ష్యంతో సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక ప్రస్తుతం నిరుపయోగంగా మారుతోంది అని పత్రికల్లో వచ్చి ప్రజలు ఈ విషయమే చర్చించుకుంటున్నప్పటికీ వ్యవసాయ అధికారులలో మాత్రం చలనం లేదు.. నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్న చందనంగా వ్యవసాయ శాఖ అధికారుల పేరుతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక అధికారుల పర్యవేక్షణ లోపంతో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో విష సర్పాలకు ఆవాసంగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు నిద్రమత్తు వీడి రైతు వేదికను పరిశీలించి వెంటనే దానిని పరిశుభ్రంగా చేసి రైతులకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు చేపట్టి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదా వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికలో ఉండి వారి సేవలను కార్యకలాపాలను కొనసాగించేటట్లు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయాలని దీంతో నైనా రైతు వేదిక లకు అందుబాటులో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


