హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలి : డీసీసీ అధ్యక్షుడు డా. చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూల్

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంపై నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని కోరారు. తమ తమ ప్రాంతాల్లో పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి