లో వోల్టేజీ సమస్యకు పరిష్కారం.. ముచ్చర్ల, సాయిరెడ్డిగూడలో 3 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు
రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరాపై SE రవికుమార్, DE గోపాలకృష్ణ క్షేత్రస్థాయి పరిశీలన
కందుకూరు :వ్యవసాయానికి నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, లో వోల్టేజీ సమస్యల కారణంగా పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకునే దిశగా విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఎలక్ట్రిసిటీ ఎస్ఈ రవికుమార్, కందుకూరు డీఈ గోపాలకృష్ణ శుక్రవారం ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా వ్యవసాయానికి విద్యుత్ ఏ విధంగా సరఫరా అవుతోంది, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటున్నారా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనే అంశాలను అధికారుల బృందం రైతులను అడిగి తెలుసుకుంది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి వాటి పనితీరును సమీక్షించింది.కె ఎల్ ఆర్ ఆదేశాలతో మూడు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లుమహేశ్వరం ప్రభుత్వ ఇన్చార్జి శ్రీ కె ఎల్ ఆర్ ఆదేశాల మేరకు ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ గ్రామాల పరిధిలో లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా మూడు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ చర్యలతో వ్యవసాయ విద్యుత్ సరఫరా మెరుగుపడి, నీటి పారుదలకు ఇబ్బందులు తగ్గి పంటలను కాపాడుకునేందుకు సహకారం అందిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.రైతుల సమస్యలను గుర్తించి విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలు తీసుకున్నందుకు గ్రామ సర్పంచ్ కొంగళ్ల అనిత కృష్ణతో పాటు రైతులు కె ఎల్ ఆర్ కు, ఎస్ఈ రవికుమార్, డీఈ గోపాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.రైతులకు అందుబాటులో విద్యుత్ శాఖ :-వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా కీలకమైనందున, రైతులకు ఎదురయ్యే సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. ముఖ్యంగా లో వోల్టేజీ సమస్యలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ కొనసాగించాలని, విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సత్తినేని వెంకట్ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొర్ర యాదమ్మ రాములు, వార్డు సభ్యురాలు బుక్క లక్ష్మి రమేష్, జేఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి, రైతులు పెంటయ్య, బాలయ్య, సిందం మంజుల, రాకేష్ గౌడ్, కొంగళ్ల కృష్ణ, సకిలాల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


