నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్

నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన  యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్

నాగర్ కర్నూల్ : యూత్ డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని BJYM డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో BJYM జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి వెంటనే అమలు చేయాలి, హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి, రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులకు హామీ ఇచ్చిన స్కూటీలను వెంటనే పంపిణీ చేయాలి, SC, ST, BC విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.10 లక్షల వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి. సుమారు 40 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధన్నోజు నరేష్ చారి విమర్శించారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని BJYM డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని BJYM హెచ్చరించింది. హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం యువత, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, పోల్దాస్ రాము, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్, రాకేష్ వర్మ, ఇతర BJYM నాయకులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి