పిఆర్టీయూ టీఎస్ (PRTU TS )రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మాంగ్య నాయక్ రాథోడ్

ఏకగ్రీవంగా ఎన్నిక పై ఉపాధ్యాయవర్గాల హర్షం.

పిఆర్టీయూ టీఎస్ (PRTU TS )రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మాంగ్య నాయక్ రాథోడ్

రేగోడ్ (మెదక్ ): పిఆర్టియు టిఎస్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా రేగోడు మండలానికి చెందిన కే. మంగ్య నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నల్గొండలో రెండు రోజులుగా జరుగుతున్న పిఆర్టీయూ టీఎస్ ఆరవ రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో శుక్రవారం ఆయనను రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంగ్య నాయక్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుగా ఎన్నుకోవడం పై రేగోడు మండలం ఉపాధ్యాయులతో పాటు మెదక్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్ర కమిటీలో రేగోడు మండలానికి ప్రాతినిధ్యం లభించడం సంతోషంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సుంకరి బిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, జిల్లా శాఖ  అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 40

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి