కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?

అనుమతి లేని రోజున వసూళ్లు చేసిన కాంట్రాక్టుపై విచారణ జరిపి, కాంట్రాక్టును రద్దు చేయాలి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం

కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?

హుస్నాబాద్ ÷తరతరాల చరిత్ర కలిగిన సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పూర్వీకుల కాలం నుంచి ప్రతి ఆదివారం వారసంత నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, అలాంటి చోట శనివారం రోజున కూడా వారసంత పేరుతో పూల దుకాణాల వద్ద తైబజార్ డబ్బులు వసూలు చేయడం ఏమిటని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 
వారసంత నిర్వహించని రోజున వ్యాపారుల నుంచి తైబజార్ రుసుములు వసూలు చేయడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? కాంట్రాక్టర్‌కు ఏ నిబంధనల ప్రకారం ఈ అధికారం కల్పించారు? ఈ వ్యవహారంపై గ్రామ పంచాయతీ అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ నిబంధనలకు, కాంట్రాక్టు ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా వసూళ్లు జరిగాయి అనుమతి లేని రోజున వసూళ్లు చేసారు కాబట్టి సదరు కాంట్రాక్టుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వసూళ్ల వెనుక ఎవరి ప్రమేయం ఉంది?వారసంత లేని రోజున కూడా తైబజార్ వసూళ్లు చేయడానికి బాధ్యులెవరు? ఈ వసూళ్లకు ఎవరు సహకరించారు? వసూలైన డబ్బులు ఎవరికి చేరుతున్నాయి? ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు.ఈ అంశంపై బీజేపీ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, చిరు వ్యాపారుల కష్టార్జితాన్ని ఇష్టానుసారంగా వసూలు చేసేందుకు ఎవరికి అధికారం లేదన్నారు.వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలన్నారు.శనివారం రోజున వసూలు చేసిన తైబజార్ రుసుములు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారు ఆ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టర్ తిరిగి గ్రామ పంచాయతీకి చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు.అదేవిధంగా, ఆదివారం మినహా ఇతర రోజుల్లో తైబజార్ రుసుముల వసూలుకు సంబంధించి స్పష్టమైన అనుమతులు, నిబంధనలు ఏమిటో గ్రామ పంచాయతీ అధికారులు వెల్లడించాలని కోరారు. అధికారిక అనుమతి, వర్తించే నిబంధనల ఆధారంగానే వసూళ్లు జరగాలని, రైతులు మరియు చిరు వ్యాపారులపై అనవసరమైన ఆర్థిక భారం పడకుండా చూడాలని సూచించారు.ఇష్టానుసారంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.కోహెడలో జరుగుతున్న ఈ వసూళ్ల వ్యవహారంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే బీజేపీ ప్రజల పక్షాన ఉద్యమిస్తుందని ఖమ్మం వేంకటేశం హెచ్చరించారు. తైబజార్ కాంట్రాక్టు నిబంధనలు, వసూళ్లకు సంబంధించిన రికార్డులు, అనుమతులను పరిశీలించి నిజానిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.రైతులు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, ఈ వ్యవహారంలో బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలు తీసుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ తాగునీటి సమస్య తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 17 :(విజన్ ఆంధ్ర )ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఎక్కడ కూడా...
నాగర్ కర్నూల్ జిల్లాలో BJYM ఆధ్వర్యంలో నిరసన యూత్ డిక్లరేషన్ హామీల అమలు చేయాలని డిమాండ్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ 
కోహెడలో అసలేం జరుగుతోంది? వారసంత లేని రోజున తైబజార్ వసూళ్లకు ఎవరు అనుమతిచ్చారు?
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
కరువు ముప్పు నివారణకై  కళాజాత  అవగాహన
నూజివీడు సీడ్స్ వారి ఆద్య పత్తి తో అధిక దిగుబడి ---- రీజనల్ మ్యానేజర్ శ్రీకాంత్ రెడ్డి