నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆపరేషన్ థియేటర్లలో ఆయుధ పూజలు చేసిన సూపరింటెండెంట్ డా. సుప్రియ
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. సుప్రియ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలోని వివిధ ఆపరేషన్ థియేటర్లలో శాస్త్రోక్తంగా ఆయుధ పూజలు, దుర్గాదేవి పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య గైనకాలజీ, సర్జికల్, ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని, గర్భిణులకు సుఖ ప్రసవం జరగాలని, తల్లీబిడ్డలు క్షేమంగా ఇంటికి చేరాలని వైద్యులు, సిబ్బంది దుర్గమ్మను ప్రార్థించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన బతుకమ్మలకు పూజలు చేసి వైద్యులు, నర్సింగ్ అధికారులు ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ రవిశంకర్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆర్. సంగీత, వైద్యులు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


