అంబరాన్నంటిన రాచకొండ బతుకమ్మ సంబరాలు!
ఇఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడలో ఘనంగా వేడుకలు ఫ్లోరోసిస్ నిర్మూలనకు పోరాటం కొనసాగిస్తాం ఫౌండేషన్ ఛైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ శివన్నగూడెం రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి అంగరంగ వైభవంగా వేడుకలు జరిపిన ఐతగోని నర్సింహ బృందం
నల్గొండ/మర్రిగూడ:తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ వేడుకలను ఇఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు,సాంప్రదాయ దుస్తుల్లో కరివేల్పిన మహిళలు, ఆటపాటలు, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణమంతా పండుగ శోభ సంతరించుకుంది.ఈ వేడుకల్లో పాల్గొన్న ఇఎల్వి ఫౌండేషన్ ఛైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు అందించడంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఫ్లోరోసిస్ పోరాటానికి సిద్ధంఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ, "రాచకొండ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా మునుగోడు ప్రాంతాన్ని ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య శాశ్వత నిర్మూలనకు నా వంతు కృషి చేస్తాను. ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ముందుండి పోరాటం చేస్తాను. ఈ ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములై నాతో కలిసి అడుగులు వేయాలి" అని పిలుపునిచ్చారు. అలాగే శివన్నగూడెం రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.సమన్వయంతో వైభవంగా వేడుకలుఇఎల్వి ఫౌండేషన్ మండల కన్వీనర్ ఐతగోని నర్సింహ పర్యవేక్షణలో ఈ బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి సాంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో అల్లరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కమ్మంపాడు వెంకటేష్, కొల్లేటు లింగయ్య, ఇఎల్వి ఫౌండేషన్ సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


